గరుడ ప్రతినిధి పుంగనూరు

నవధాన్యాల సాగు శ్రేయోదాయకమని వెలుగు ఏపిఎం సుబ్రహ్మణ్యం అన్నారు గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో రైతు సాధికారత సంస్థ ఆధ్వర్యంలో నవధాన్యాల సాగుపై రైతు సమాఖ్య వెలుగు మహిళలకు అవగాహన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ మండల వ్యాప్తంగా 146 రైతు మిత్ర సంఘాలు కాగితలో మహిళా రైతులు ఉన్నారన్నారు వారందరికీ ప్రతినెల నవధాన్యాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు ప్రకృతి వ్యవసాయంతో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంపొందించడం వల్ల సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుందన్నారు అనంతరం ప్రకృతి వ్యవసాయం సేంద్రియ ఎరువులు వంటి వాటిపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ సూపర్డెంట్ నిషార్ అహ్మద్ ఎఫ్ బి ఓ ఏపిఎం నీరజ ఎన్ ఎఫ్ ఏ మహేష్ ఎంటీ రెడ్డి కుమారి లోకేష్ రెడ్డమ్మ రైతు వెలుగు సంఘాల మహిళలు పాల్గొన్నారు


