గోదావరి జిల్లా, కొత్తపేట మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): (ఆలమూరు) మండలంలోని జొన్నాడ గ్రామానికి చెందిన మేడపాటి నాగేంద్ర సత్యనారాయణ రెడ్డి, మల్లేశ్వరి దంపతుల కుమార్తె హేమాక్షిక రెడ్డి(2) 108 ఫ్లై కార్డులను అతి తక్కువ సమయంలో గుర్తించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ 2025లో చోటు దక్కించుకున్నట్లు చిన్నారి తల్లిదండ్రులు తెలియజేశారు. రెండు సంవత్సరాల కన్నా చిన్న వయసులో 4 నిమిషాల, 44 సెకండ్లలో పండ్లు, జంతువులు, శరీర భాగాలు, పక్షులు, వాహనాలు, ఇతర వస్తువులతో కూడిన 108 ఫ్లైకోడ్లను అతి తక్కువ సమయంలో గుర్తించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో ‘ఐబిఆర్ అచీవర్’ అనే అవార్డు చిన్నారి హేమాక్షికా రెడ్డి దక్కించుకుందన్నారు. ఇంతటి చిన్న వయసులో అత్యంత ప్రతిభను కనబరిచినందుకు చిన్నారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తెలియజేసిన పరిజ్ఞానంతో ఇంతటి ప్రతిభను కనబరిచిన చిన్నారిని పలువురు గ్రామస్తులు అభినందిస్తున్నారు._




