గరుడ న్యూస్,గుమ్మలక్ష్మీపురం
గుమ్మ లక్ష్మి పురం మండలం, రేగిడి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో వైద్యం పేరిట పురుష ఉపాధ్యాయులుగిరిజన బాలికలను బయటకు, ప్రైవేట్ ఆసుపత్రి కీ,ఆర్ ఎం పి డాక్టర్స్ వద్దకు తీసుకుని వెళ్లారన్నా ఆరోపణల పై సమగ్ర విచారణ జరిపించాలని గిరిజన సంక్షేమ సంఘం, గిరిజన విద్యార్థి సంఘం, గిరిజన అభ్యుదయ సంఘం, ట్రైబల్ రైట్స్ ఫోరమ్, ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్, ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ సంఘాల నాయకులు డిమాండ్ చేసారు.
ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్, పార్వతీపురం ఐ టీ డి ఏ పి ఓ
అసుతోష్ శ్రీ వాస్తవ్ కు వేరు వేరు గా వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్బంగా ఆయా సంఘాల నాయకులు
పాలక రంజిత్ కుమార్, పల్ల సరేష్, మువ్వల అమర్నాద్, ఆరిక చంద్ర శేఖర్, ఇంటికిప్పల రామకృష్ణ, చెల్లూరు సీతారాం, కోలక గౌరమ్మ, బీ. రవి కుమార్, బీ టీ. నాయుడు మాట్లాడుతూ
బాలికల పాఠశాలల్లో పురుష ఉపాధ్యాయులను నియమించడమే అనేక సమస్యలకు కారణమన్నారు.
రేగిడి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో
మహిళా ఉపాధ్యాయులు, మహిళా డెప్యూటీ మెట్రీన్ ఉండగా పురుష ఉపాధ్యాయులు బాలికలను వైద్యం పేరిట బయటకు ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించ్చారు.
అసలు ప్రైవేట్ క్లినిక్ కి,ఆర్ ఎం పి డాక్టర్స్ వద్దకు ఎందుకు తీసుకెళ్లారని విద్యార్థి ఆరోగ్యంనకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులని నిలదీశారు.
ఈ సంఘటన జరిగి ఇన్నిరోజులైనా ఎటువంటి చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేసారు.
తక్షణమే
మహిళా అధికారులచేత విచారణ చేయాలని డిమాండ్ చేసారు.
విచారణ సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధానోపాధ్యాయుడు మరియు పురుష ఉపాధ్యాయులు పాఠశాలలో లేకుండా విచారణ జరపాలని అప్పుడే పాఠశాలలో ఎం జరిగిందో వాస్తవాలు వెలుగు లోకి వస్తాయని అన్నారు.
గిరిజన బాలికల ను వైద్యం పేరిట బయటకు తీసుకెళ్లే టప్పుడు తల్లి, తండ్రులకు సమాచారం ఇచ్చారా లేదా? అనే కోణంలో కూడా విచారణజరపాలని కోరారు.
ఈ సందర్బంగా కలెక్టర్, ఐ టీ డి ఏ, పి ఓ లు
మాట్లాడుతూ
ముగ్గురు మహిళా అధికారులతో విచారణ కమిటీ వేస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రేగిడి పాఠశాలలో పరిణామాల పై సమగ్ర విచారణ జరపాలి…

గిరిజన బాలికల