పార్వతీపురం మన్యం జిల్లా,సాలూరు,ఏప్రిల్ 11,ఆర్టీఐ నిఘా న్యూస్:
కూటీ కొరకు కోటి విద్యలు అనే సామెత బాగా ప్రాచుర్యం పొందింది.సాలూరు మండలం లో ఖరాస వలస లో ఇటీవల కాలంలో తల్లిదండ్రులు కంప్లైంట్ తో మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి ఆకస్మిక తనిఖీ చేశారు.స్కూల్ పిల్లలు పడిన ఆకలి బాధలకు ఎవరు బాధ్యులు? పిల్లలు దేవుడు చల్లని వారే…కల్ల కపటం ఎరుగని కరుణామయులే అని ఒక పాత గీతం గుర్తొస్తోంది.ఇంటి పెద్ద బాధ్యత ఇల్లును చూసుకోవడం,తల్లి దండ్రులు,భార్య,పిల్లల పోషణ వంటివి ఉంటాయి.అదే ఒక స్కూల్ యాజమాన్యం బాధ్యత ఏమిటి…అది అధిక మొత్తం లో ఉప్పు,పప్పు, వంటి పన్నుల ద్వారా ప్రజల సొమ్ము అందుకుంటూ ఉన్న ప్రభుత్వ స్కూల్ సిబ్బంది,ప్రధానోపాధ్యాయులు ఎంత బాధ్యత గా ఉండాలి? పిల్లల ఆకలి కేకలు పెడుతూ ఉంటే దేవుడు మన్నిస్తాడా? కారణం ఏమైనా ఒక మాట గుర్తుకు వస్తుంది.రెండు చేతులు కలవనిదే చప్పట్లు కొట్టడం కుదరదు.కనుక ప్రతి చిన్నారిని బాధ్యతగా సొంత పిల్లలు లాగా చూసుకోవాలి. భావి భారత పౌరులకు గొప్ప భవిష్యత్ అందించాలి.




