ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 198 జయంతి వేడుకలు

G Venkatesh
1 Min Read

గరుడ ప్రతినిధి పుంగనూరు

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తత్వవేత్త రచయిత విప్లవవేత్త నవయుగ వైతాళికుడు మహాత్మ జ్యోతిరావు పూలే198 వ జయంతి సందర్భంగా స్థనిక తాహాశిల్దార్ కార్యాలయం లో జ్యోతిరావు పూలే చిత్రపటానికి తహశీల్దార్ హనుమంతు నాయక్   వారి ఆధ్వర్యంలో  పూలమాలవేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా తాహాశిల్దార్ హనుమంతు మాట్లాడుతూ 1827 లో మహాత్మ జ్యోతిరావు పూలే జన్మించారని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా పేరుగాంచి బాల్యవివాహాలు అరికట్టి మహిళలకు విద్యా హక్కు కల్పన అస్పృశ్యతను రూపుమాపేందుకు నిర్విరామంగా కృషిచేసి సమ సమాజ స్థాపనకు విజన్ కలిగి జీవించిన తత్వవేత్త మేధావి పూలే అన్నారు.మానవునిగా ఎంతోమంది పుడుతూ ఉంటారు మరణిస్తూ ఉంటారు మానవ జన్మను సార్థకం చేసుకున్న మహానుభావుడు మహాత్మ జ్యోతిరావు పూలే అన్నారు. మనిషి ఎన్ని రోజులు బ్రతకామన్నది ముఖ్యం కాదని సమాజ కోసం సమాజ అభ్యున్నతి కోసం ఏం చేశామన్నది ముఖ్యమని మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగించే దిశగా విద్య ద్వారా సమ సమాజం సాధ్యమని విశ్వసించి అదే బాటలో మనం కొనసాగాలని సందర్భంగా గుర్తుకు చేశారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *