రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం, ఏప్రిల్12,(గరుడ న్యూస్ ప్రతినిధి):
కాంగ్రెస్ పార్టీ ఓబీసీ జిల్లా సంయుక్త కార్యదర్శి దంటిక అశోక్ యాదవ్ జన్మదిన వేడుకల సందర్భంగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆయన క్యాంపు కార్యాలయంలో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలన్నారు.రాజకీయంగా ఇంకా పదవులతో ముందుకు సాగాలన్నారు.కాంగ్రెస్ పాలన గురించి ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలబడి గ్రామాలలో సేవ చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మాజీ కౌన్సిలర్ భరత్,కాంగ్రెస్ పార్టీ గుట్ట అధ్యక్షుడు కానుగు బాలరాజు గౌడ్,బలరాం తదితరులు,పాల్గొన్నారు.




