
ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో 966, బైపిసి గ్రూపులో 974 మార్కులు

ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూపులో 463 మార్కులు,బైపిసి గ్రూపులో 433 మార్కులు
విద్యార్థులు ను అభినందించిన కళాశాల ప్రిన్సిపాల్ L. పద్మావతి మరియు ఉపాధ్యాయులు
డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకులం (బాలికలు) కొమరాడ , పార్వతీపురం మన్యం జిల్లా యందు చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు 2024-2025 సంవత్సరంలో జరిగిన పబ్లిక్ పరీక్షలలో వంద కి వందశాతం ఉత్తర్ణత సాంధించారు. మొదటి సంవత్సరము కు 73 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 73 కి 73 మంది ఉతీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 61 మంది పరీక్ష ల కు హాజరు కాగా 61 కి 61 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాంధించారు . ద్వితీయ సంవత్సరంనకు గాను కళాశాల ప్రథమస్థానంలో ది. దుర్గాభవాని 974 | 1000 (బైపీసీ) ద్వితీయ స్థానంలో గాయిత్రి కుమారి 968 (ఎంపీసీ) మార్కులు సాధించారు. మొదటి సంవత్సరంనకు ప్రథను స్థానంలో పి. రేవతి 463/470 ద్వితీయ స్థానంలో వై. ప్రశాంతి 433/440 మార్కులు సాందించారు. డా॥బి. ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయకర్త ఎస్. రూపవతి , ప్రిన్సిపాల్ ఎల్. పద్మావతి మరియు వైస్ ప్రిన్సిపాల్ ఎ. రజిని కుమారి కళాశాల ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులకు అభినందనలు తెలియజేసారు.



