గోదావరి జిల్లా, కొత్తపేట మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి):తణుకు వరప్రసాద్: అయ్యప్ప స్వామి వారి జన్మ నక్షత్ర అయిదవ వార్షికోత్సవం వేడుకలు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారి పాల్గొన ఉత్తర జన్మ నక్షత్రం సందర్భంగా అయ్యప్పస్వామి భక్తుడు దూలం రవితేజ ఆద్వర్యంలో ప్రతి ఏటా ఈ గ్రామంలో పూజా కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తున్నారు. కడియంకు చెందిన తాడాల వీర వెంకటరావు గురుస్వామి ఆధ్వర్యంలో పూజాది అభిషేకాల కార్యక్రమం ప్రతీ ఏటా వైభవంగా చేపట్టారు. పడాల వెంకటేశ్వరరావు గురుస్వామి పర్యవేక్షణలో దూలం రవితేజ, యెరుబండి మధు, తమ్మన వెంకన్న బాబు, పడాల గోపాలకృష్ణ ఇతర శిష్య బృందం వేలాది రూపాయల వ్యయంతో ఈ వేడుకలను నిర్వహించారు. వంగలాదిగా అయ్యప్ప స్వామి భక్తులు తరలివచ్చి ఈ వేడుకలను చిలకరించారు 54 కలశాలతో స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. అలాగే పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు,పండ్ల రసాలతో స్వామివారికి భక్తులు విశేష పూజాభిషేకాలు చేపట్టారు. చొప్పెల్ల శివాలయ అర్చకులు యలమంచిలి రాజశేఖర్ శర్మ మంత్రోచ్ఛారణల మధ్య ఈ వేడుకలు జరిగాయి. స్వామియే శరణం అయ్యప్ప శరణ ఘోషలతో మారుమ్రోగాయి. ఈ వేడుకలకు ఆలమూరు మండలంతో పాటు కడియం, రావులపాలెం తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు, అయ్యప్ప గురుస్వాములు తరలి వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గురు స్వాములను రవితేజ ఆద్వర్యంలో సత్కారాలు జరిగాయి. అత్యంత వైభవంగా జరిగిన ఈ అయ్యప్ప స్వామి వారి నక్షత్ర వేడుకలకు అధిక సంఖ్యలో అయ్యప్ప స్వామి భక్తులు తరలి వచ్చిన వేడుక చివరి వరకూ ఉండి తీర్ద ప్రసాదాలు స్వీకరించారు.




