
మైదుకూరు, బ్రహ్మంగారిమఠం గరుడ న్యూస్ (ప్రతినిధి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారి మఠంలో శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన ఉత్సవాల సందర్భంగా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ శనివారం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మంగారి ఆరాధన మతపరంగా గొప్ప ప్రాధాన్యత కలిగి ఉందని, భక్తుల పాల్గొనదగిన మహోత్సవంగా నిలుస్తుందన్నారు. ఆవిష్కరణ అనంతరం బ్రహ్మంగారి మఠం పిట్ పర్సన్ శంకర్ బాలాజీ ఎమ్మెల్యేను అధికారికంగా ఆరాధన కార్యక్రమానికి ఆహ్వానించారు. అదేవిధంగా మండల కేంద్రంలో కళ్యాణ మండపం మరియు పోలేరమ్మ గుడి వద్ద చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవానికి హాజరు కావాలని ఆహ్వానం అందించారు. ఈ కార్యక్రమంలో పూర్వపు మఠాధిపతి కుమారుడు వెంకటాద్రి స్వామి, టీడీపీ మండల నాయకులు పూజ శివ యాదవ్ తో సహా పలువురు స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

