గోదావరి జిల్లా కొత్తపేట మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): తణుకు వరప్రసాద్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమలపై ప్రత్యేక దృష్టి పెట్టింది : ఎమ్మెల్యే సత్యానందరావు వెల్లడి.. తిరుమల గోశాలలో ఆవులు మృతి చెందాయని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమా కరుణాకర్ రెడ్డి దుష్ప్రచారం చేయడం తగదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుండి తిరుమల పవిత్రతను కాపాడటానికి, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక కృషి చేసిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో తిరుమల ప్రతిష్టను దెబ్బతీసి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం తిరుమల పవిత్రతను కాపాడేందుకు,సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నామో స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులను అడిగితే తెలుస్తుందని చెప్పారు. తిరుమల గోశాలలో వందలాది ఆవులు మరణించాయని చేసిన దుష్ప్రచారాన్ని వారు ఖండించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 2668 గోవులు ఉన్నాయని వాటిలో అనారోగ్యం, వృద్ధాప్యం వల్ల మాత్రమే చనిపోతే చనిపోయాయని వాటిని పోస్టుమార్టం చేసి వివరాలు నమోదు చేస్తారని తెలిపారు. గోశాలలో గోవులను జియో ట్యాగింగ్ ద్వారా టీటీడీ నిరంతరం పర్యవేక్షిస్తుందని వివరించారు.
