

సాహితి లహరి మరియు మంచిపల్లి సేవా సంస్థ పార్వతీపురం వారు నిర్వహించే శ్రీమతి మంచిపల్లి సత్యవతి స్మారక జాతీయ బాల సాహిత్య పురస్కార ప్రధానోత్సవం కార్యక్రమం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ ఎ. శ్యామ్ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ఆదివారం పార్వతీపురం సూర్యపీఠం లో నిర్వహించే కార్యక్రమంలో ప్రముఖ రంగాల్లో సేవలందించే ప్రముఖులకు పురస్కారాలు అందించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఉత్తమ నేత్ర వైద్య సేవలు అందిస్తున్న నేత్ర వైద్య అధికారి డా నగేష్ రెడ్డి కి సేవాశ్రీ పురస్కారం తో ఘనంగా సన్మానించారు. ఇతనికి కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మరియు ఎస్ టి కమీషన్ చైర్మన్ డా శంకరరావు చేతుల మీదుగా దుశ్శాలువతో సత్కరించి జ్ఞాపికను అందచేశారు. నగేష్ రెడ్డి చేస్తున్న సేవలకు గతంలో కూడా జాతీయ మరియు రాష్ట్ర ప్రభుత్వం, స్వచ్ఛంధ సంస్థలు అనేక పురస్కారాలు,సన్మానాలు అందచేశారు. నగేష్ రెడ్డి మాట్లాడుతూ ఇటువంటి పురస్కారాలు తో నాపై ఎంతో బాధ్యత పెంచి ప్రజలకు మరింత నేత్ర వైద్య సేవలు అందించడానికి ఎంతో దోహద పడుతుందని అన్నారు.
