గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు సుగాలి మిట్ట వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కదిరి మండలం బాలప్పగారిపల్లిలో టీచర్ గా పని చేసే శారద (45) అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె భర్త వెంకటరమణ, ఆమె కుమార్తె కీర్తన వీరి ఇరువురు సైతం తీవ్రంగా గాయపడ్డారు. మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం వీరిరువురిని వెంటనే బెంగళూరుకు మెరుగైన వైద్య చికిత్స కోసం తరలించారు. తీవ్రంగా గాయపడిన వెంకటరమణ ములకలచెరువు సమీపంలోని సోంపల్లి లో స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. శారద మృతదేహాన్ని మదనపల్లి ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిమిత్తం ఉంచారు. కదిరికి చెందిన ఈ దంపతులు కొత్త కారు కొనుగోలు చేసి అరుణాచలం లో స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పుంగనూరు సుగాలిమిట్ట వద్ద వేగంగా దూసుకొచ్చిన లారీ వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. పోస్టుమార్టం అనంతరం ఈమె మెట్టినిల్లు కలకడకు తరలించనున్నారు.


