
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను పురష్కరించుకొని పార్వతీపురం స్థానిక మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారధ్యంలో నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. నియోజకవర్గం పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరితో కలిసి మాజీ శాసనసభ్యులు జోగారావు పార్వతీపురం ప్రధాన రహదారి 13వ వార్డు ఇందిరా కాలనీ ఎదురుగా గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి జై భీమ్ అని పెద్ద సంఖ్యలో నినాదాలు చేస్తూ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగినది. అనంతరం మాజీ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ భారత రాజ్యాంగ సృష్టికర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, దాడిది పీడిత అనగారిన వర్గాల ఆరాధ్యులైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమక్షంలో నిర్వహించుకోవడం నిజంగా తమ అందరికీ గొప్ప గర్వకారనంగా ఉందని తెలిపారు. నాడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంబేద్కర్ ఆసయ సాధనకు అనుకూలంగా పరిపాలన సాగిస్తే నేడు కూటమి ప్రభుత్వంలో అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా రెడ్ బుక్ పాలన కొనసాగిస్తూ ప్రజలను తీవ్రంగా వేధిస్తు అరాచక పాలనను నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారన్నారు. ఇప్పటికైనా నాడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కృషి చేయాలని అలా కాకుండా హామీలను అమలు చేయమని అడుగుతున్న వైసీపీ నాయకులను రాష్ట్ర ప్రజానీకాన్ని భయపెట్టి ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి డైవర్షన్ రాజకీయాలకు అలవాటు పడ్డ చంద్రబాబు బుద్ధి మార్చుకోకపోతే తప్పకుండా రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజానీకం తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలో గల మూడు మండలాలు మరియు పురపాలక సంఘం వైసిపి పార్టీ ప్రజాప్రతినిధులు చైర్ పర్సన్ బోను గౌరీశ్వరి, వైస్ చైర్మన్ యిండుపూరు గుణ్ణేశ్వరరావు, ఎంపీపీలు మజ్జి శోభారాణి, గుడివాడ నాగమణి, జడ్పిటిసిలు అలజంగి రవికుమార్, మామిడి బాబ్జీ, బలగ నాగేశ్వరరావు, మండలాలు మరియు పట్టణ పార్టీ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, బొమ్మి రమేష్, బొంగు చిట్టి రాజు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు బలగ శ్రీరాముల నాయుడు, జిల్లా పార్టీ ప్రతినిధులు ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, నియోజకవర్గ వివిధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర విభాగాల ప్రతినిధులు, కౌన్సిలర్ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



