మైదుకూరు, బ్రహ్మంగారిమఠం గరుడ న్యూస్ (ప్రతినిధి): 2025-2026 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల పునర్నిర్మాణం, బోధన సిబ్బంది పునర్విభజనపై Go 117 ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది.G O 117కు ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న 3,4,5 తరగతుల విద్యార్థులు తిరిగి అదే ప్రాంగణంలో గల ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ఇతర పాఠశాలల్లో చేరే అవకాశం కలదు. ఇదే జరిగినట్లయితే బాలికోన్నత పాఠశాల యందు విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో పాటు పాఠశాలలో పనిచేయుచున్న ఉపాధ్యాయులు రేషనలైజేషన్కు గురి అయ్యి పాఠశాల మనుగడ ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి కలదు. అందువల్ల ఓకే కాంపౌండ్ లో ప్రాథమిక పాఠశాల కల ఉన్నత పాఠశాలలో 1 నుండి 10 నిర్వహించమని పాఠశాల కమిటీ సభ్యులు మరియు స్థానిక తెలుగుదేశం ఉపాధ్యక్షులు శీలం నర్సింహులు, పాఠశాల కమిటీ ఉపాధ్యక్షులు రమణ తెలుగు ఉపాధ్యాయుడు లెక్కల కొండారెడ్డి స్థానిక ఎమ్మెల్యే శ్రీ పుట్ట సుధాకర్ యాదవ్ గారిని కలిసి వినతి పత్రం అందించడం జరిగింది. ఎమ్మెల్యే గారు దీనిపై దృష్టి సారిస్తానని తెలియజేయడం జరిగింది.





