
గరుడ ప్రతినిధి పుంగనూరు

చౌడేపల్లి నడివీధి గంగ జాతరను ఈనెల 15, 16 తేదీలలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతరను ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించేలా నిర్వాహకులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు కుమ్మరి వీధిలో అమ్మవారి ఉత్సవ మూర్తిని తయారు చేసేందుకు ప్రత్యేకించి స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు పట్టణం నుంచి పొరుగు ప్రాంతాలకు వెళ్లిన వారందరూ చేరుకోవడంతో చౌడేపల్లిలో పండగ వాతావరణం నెలకొంది