తిరుపతి జిల్లా, రేణిగుంట మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): రిపోర్టర్: పాకాల. మురళి: అంబేద్కర్ జయంతి సందర్భంగా రేణిగుంటలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు, వేసి నివాళులర్పించిన కాలాస్త్రి ఎమ్మెల్యే ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. అంబేద్కర్ స్ఫూర్తితో, యువకులందరూ, చైతన్యవంతులు కావాలని కోరారు. ప్రజలంతా సమాన హక్కులు కలిగి, స్వేచ్ఛగా బతకాలని, ఆకాంక్షించిన, మహానీయుడు అంబేద్కర్ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో, పట్టణ అధ్యక్షుడు మాభాష , చంద్రారెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, పుష్ప నాదం, అంబికా పతి యాదవ్, ఎం జి రెడ్డి,మైనారిటీ నాయకులు నవాబ్, చైతన్య, విద్యాసాగర్, శివయ్య నాయుడు దేవల్ల రమణ, కొరియర్ రవి, కన్నా రెడ్డి, సుమన్, వెంకట ముని రెడ్డి, నాదముని రెడ్డి, మహిళా నాయకులు మేరీ, సుధముని, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






