
తిరుపతి జిల్లా, తిరుచానూరు గరుడ న్యూస్ (ప్రతినిధి): తిరుచానూర్ ఇంటర్ ఫలితాల్లో తిరుచానూరు సంస్కృతి కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపరచినట్లు ఆ సంస్థల డైరెక్టర్ ప్రణీత్ మీడియా సమావేశంలో తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ద్వితీయ సంవత్సరా ఫలితాల్లో సీకే జితేష్ 991/1000 మార్కులతో రాష్ట్రస్థాయిలో రెండవ స్థానం మరియు తిరుపతి జిల్లా స్థాయిలో మొదటి స్థానం సాధించారు. మరియు ఇంటర్ ప్రధమ ద్వితీయ 50% పైగా విద్యార్థులు 90% మార్కులు సాధించారు. ఈ విజయ ఫలితాలు సాధించిన విద్యార్థులను మరియు అందుకు కృషి చేసిన ఆధ్యాపకులను సంస్కృతి విద్యా సంస్థల చైర్ పర్సన్ పి సులోచన మరియు డైరెక్టర్ ప్రణీత్ అభినందించినారు. ఈ కార్యక్రమంలో సంస్కృతి విద్యా సంస్థల సిబ్బంది మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

