రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,పోచంపల్లి,ఏప్రిల్ 16,(గరుడ న్యూస్ ప్రతినిధి):
తెలంగాణ ఉద్యమకారుడు భువనగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పోచంపల్లి నేతన్న బిడ్డ తడక వెంకటేష్ రాజకీయ ప్రస్తావం దాదాపుగా 35 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తూ ఎందరో పార్టీలు మారిన,కాంగ్రెస్ పార్టీలోనే ఉండి పార్టీని నిలబెట్టి భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపులో కీలక పాత్ర పోషించిన నేత తడక వెంకటేష్ పోచంపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా ముందుండి కార్యకర్తలకు అండగా నిలబడిన వ్యక్తి,దాదాపుగా పది సంవత్సరాలు పోచంపల్లి సర్పంచిగా,పోచంపల్లి మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసినాడు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో బిఆర్ఎస్ నాయకులు పదవులు ఇస్తామని పార్టీలోకి రమ్మని ఆహ్వానించిన వెళ్ళని మచ్చలేని నాయకుడు తడక వెంకటేష్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలు గడుస్తుంది ఈ ఉద్యమకారుడు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడి కి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పదవి ఇచ్చి గౌరవిస్తుందో వేచిచుడాలి.




