
విజయనగరం జిల్లా గరుడ న్యూస్ ఏప్రిల్ 16, ప్రతినిధి : నాగార్జున
బొబ్బిలి మండలం అలజంగి గ్రామమునకు చెందిన చింతాడ సింహచలమమ్మ గత 3సం,, క్రితము 14 వేలు రూపాయలతో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లో ఒక పాలసీ తీసుకున్నారు…3 వ వాయిదా కట్టిన వారము రోజుల్లోనే దురదృష్టవశాత్తు అనారోగ్యంతో చనిపోయారు
అందుకు గాను భీమా మొత్తము 1,95,000/- రూపాయలు నామిని అయిన చింతాడ మరియమ్మ బ్యాంక్ ఖాతాకు జమచేయడము జరిగింది…
పేద కుటుంబములకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎంతో అండగాఉంటుంది అని , ఆర్ధికంగా అదుకుంటుంది అని
భీమా చెక్ అందజేత కార్యక్రమంలో పాల్గొన్న AGM D. రామకృష్ణ గారు తెలియజేశారు. ప్రతీ మనిషికి ఇన్సూరెన్స్ పాలసీ తప్పనిసరిగా ఉండాలి. పిల్లల చదువుకు లేదా పెళ్లిళ్లకు మరియు వృద్ధాప్య సమయం లో ఎంతగానో దోహదపడతాయి. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ డాక్టర్ సూర్యనారాయణ గారు, పాస్టర్ రవి గారు, విజయనగరం జిల్లా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ బ్రాంచ్ మేనేజర్ R. రాంబాబు నాయుడు యూనిట్ మేనేజర్ సుకుమార్ ,గ్రామ పెద్దలు, శ్రీరామ్ లైఫ్ ఏజెంట్ మిత్రులు, తదితరులు పాల్గొన్నారు.
