గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు పట్టణంలోని కుమ్మరి వీధి లో వినాయకుడి గుడి దగ్గర అగ్నిమాపక కేంద్రం సిబ్బంది గ్యాస్ సిలిండర్ల ప్రమాదాలపై బుధవారం పట్టణంలోని అవగాహన కల్పించారు. అగ్నిమాపక వర్థోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స్థానిక ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు తెలిపారు. సిబ్బంది ఒకరు సిలిండర్ కు నిప్పు అంటించి దానిని సులభంగా ఆర్పడం అన్న అంశంపై స్థానికులకు డెమో చేసి చూపించారు. అగ్ని ప్రమాదాల నివారణ పత్రాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఫైర్ స్టేషన్ సిబ్బంది,కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు