గరుడ ప్రతినిధి పుంగనూరు
పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల కేజీబీవీ విద్యార్థి స్రవంతి 965 మార్కులు సాధించింది. చిత్తూరు జిల్లాలోని కేజీబీవీల టాపర్గా ఆమె నిలవడంతో ఇంటర్ విద్యార్థిని. మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా నిన్న విజయవాడలో అవార్డు, మెడల్, లాప్టాప్ అందుకుంది. స్రవంతి తల్లిదండ్రులు శివన్న, దేవమ్మ పాల్గొన్నారు.


మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న స్రవంతిని రొంపిచర్ల కేజీబీవీ టీచర్లు సన్మానించారు. ప్రిన్సిపల్ సుజాత, టీచర్లు, ఆమెకు శాలువా కప్పి జ్ఞాపికను అందజేశారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. బాగా చదివే పిల్లలను ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను తెలుసుకుని బాగా చదవాలన్నారు ఈ కార్యక్రమంలో కేజీబీవీ టీచర్లు పాల్గొన్నారు


