రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్తాన్ నారాయణపురం,పుట్టపాక,ఏప్రిల్17,(గరుడ న్యూస్ ప్రతినిధి):
నారాయణ్ పూర్ మండలంలోని పుట్టపాక గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు,విదార్థులు నేడు ఉదయం గ్రామంలోబడిబాట కార్యక్రమం నిర్వహించారు.సుమారు 150 మంది విద్యార్థులు,వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఇందులో భాగంగా గ్రామ వీధుల్లో విద్యార్థులు మానవ హారం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఉపాధ్యాయులు విద్యార్థులు ప్లకార్డులు,ప్లెక్సీలతో బడిబాట సందేశాన్ని గ్రామస్థులకు తెలియజేశారు.విద్యార్థులు గ్రామ కూడళ్ళలో సాంసృతిక కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకొన్నారు.కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది.గ్రామస్థులు ఉపాధ్యా యులను,విద్యార్థులను అభినందిస్తూ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతును ప్రకటించారు.ఈ కార్యక్రమంలో ఎమ్.ఈ.వో గోలి శ్రీనివాసులు,పాఠశాల హెచ్ ఎమ్
ఎన్.సి.యల్లయ్య,స్థానిక హైస్కూల్ హెచ్ ఎమ్ హనుమంతు,గ్రామ పెద్దలు,విద్యార్థుల తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు విమల,హేమలత, పద్మావతి,అంతటి శ్రీనివాసులు,సునీత పాల్గొన్నారు.బడి బాట కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ సి యల్లయ్య,అందరికీ ధన్యవాదాలు తెలిపారు.




