
గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు సిఐ గా సుబ్బరాయుడు గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న సిఐ గా ఉన్న శ్రీనివాసులు సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. తిరుపతి టాస్క్ ఫోర్స్ లో విధులు నిర్వహిస్తున్న సుబ్బరాయుడు ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఇక్కడికి బదిలీ అయ్యారు సర్కిల్ పరిధిలో శాంతి భద్రతలపరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు