
గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు నియోజకవర్గ సోమల మండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా మండలానికి చెందిన ఇరికిపెంట మాజీ సర్పంచ్ కరణం శ్రీనివాసులు నాయుడు నియమితులయ్యారు. ఈయన పార్టీకి చేసిన సేవలను గుర్తించటంతో ఈ పదవి వరించినట్లు ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ కు, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి, పుంగనూరు టిడిపి ఇన్చార్జ్ చల్ల బాబుకి కృతజ్ఞతలు తెలిపారు