

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ (రూరల్) మండల శాఖ ఆధ్వర్యంలో పిఎస్ఎచ్ఎమ్ నమ్లిమెట్ ఉపాధ్యాయు మూడ లక్ష్మయ్య పదవీ విరమణ సన్మాన కార్యక్రమం మండల శాఖ అధ్యక్షులు శివరాం నాయక్ అధ్యక్షతన కింగ్స్ ఫంక్షన్ హాల్ , నారాయణఖేడ్ లో జరిగింది. మండల శాఖ ప్రధాన కార్యదర్శి కె. రాజు కార్యక్రమ వ్యాఖ్యాతలు, ప్రకాష్, శివభార్గవ్ లు అతిథులకు స్వాగతం పలికి వేదిక పైకి ఆహ్వానించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర సంఘ అధ్యక్షులు గుండు లక్ష్మణ్, విశిష్ట అతిథులుగా సంగారెడ్డి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.మాణయ్య, ఆకుల ప్రభు, నారాయణఖేడ్, మనూర్, నాగలిగిద్ద మండల విద్యాధికారులు విశ్వనాథ్, రాజశేఖర్, మన్మధ కిషోర్, టిఎన్జిఓ నాయకులు చందా శ్రీనివాస్, అశోక్ గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు దేవిసింగ్ పాల్గొన్నారు.జిల్లా అధ్యక్షులు ఎ.మాణయ్య మాట్లాడుతూ.మూడ లక్ష్మయ్య పాఠశాల విధినిర్వహణలో అంకితభావం కలిగిన ఉత్తమ ఉపాధ్యాయులని, పనిచేసిన ప్రతి పాఠశాల అభివృద్ధికి తోడ్పడ్డారని, సంఘ సభ్యులుగా నిబద్ధతతో సేవలందించారని, పదవీ విరమణ అనంతరం జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. విశ్రాంత జీవితంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి సంఘానికి కూడ ఇతోధికంగా సేవలందించాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల ప్రభు మాట్లాడుతూ పిఅర్టియు సంఘ సభ్యులుగా నేడు పదవీ విరమణ పొందుతున్న మూడ లక్ష్మయ్య సేవలను ప్రస్తుతిస్తూ శేష జీవితం ప్రశాంతంగా సాగాలని అభిలషించారు. రాష్ట్ర సంఘ అధ్యక్షులు గుండు లక్ష్మణ్ ప్రసంగిస్తూ పాఠశాలలో విద్యార్థులకు అందించిన సేవలే సమాజంలో ఉపాధ్యాయులకు గుర్తింపు నిస్తాయని, బాల్య మిత్రుడు మూడ లక్ష్మయ్య ఉపాధ్యాయుడిగా పనిచేసిన పాఠశాలల్లో సమయపాలన పాటించి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ప్రాథమిక పాఠశాల చిన్నారులకు ఓపికతో చదువు చెప్పి వారి ప్రగతికి బాటలు వేసారని అన్నారు. గత 35 ఏళ్లుగా సంఘ సభ్యులుగా సంఘ కార్యక్రమాల్లో పాల్గొని సంఘ పురోభివృద్ధికి తోడ్పడ్డారని తెలిపారు.పిఆర్టియు టిఎస్ సంఘం ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా పింగిలి శ్రీపాల్ రెడ్డి ఎమ్మెల్సీ గెలుపొందడం సంఘం పట్ల సభ్యులకు ఉన్న విశ్వాసమని, మరొక స్థానం కోల్పోవడం నిరాశ కలిగించిందని చెపుతూ రానున్న రోజుల్లో సంఘ పక్షాన ఎమ్మెల్సీ సారథ్యంలో పెండింగ్ సమస్యల సాధనకు ప్రభుత్వాన్ని నిలదీయడానికి సన్నద్ధం కానున్నట్లు తెలిపారుఅనంతరం మూడ లక్ష్మయ్య దంపతులను మండల శాఖ, జిల్లా శాఖ, రాష్ట్ర సంఘ అధ్యక్షులు గుండు లక్ష్మణ్, నారాయణఖేడ్ డివిజన్ మండల శాఖలు, ఉపాధ్యాయులు, బంధు మిత్రులు, కుటుంబ సభ్యులు శాలువా, గజమాల, సన్మాన పత్రంతో ఘనంగా సన్మానించారు.సన్మాన గ్రహీత మూడ లక్ష్మయ్య మాట్లాడుతూ తన 40 సంవత్సరాల ఉపాధ్యాయ జీవితం తన కెంతో సంతృప్తి నిచ్చిందని, సంఘ నాయకులు, అధికారుల సహకారంతో విధులు సక్రమంగా నిర్వహించానని,సంఘ పజ్షాన ఇంత ఘన సన్మానం గావించినందుకు మండల, జిల్లా, రాష్ట్ర బాధ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు యన్.మల్లయ్య, మహేష్ కుమార్, మీర్ కిఫాయత్ అలీ,గుండు హన్మయ్య, సి.హెచ్.నర్సిములు, ప్రసన్నకుమార్, గణపతి, పుండ్లిక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మేఘ్యానాయక్, ఎ. పాండురంగారెడ్డి ,యాదవరెడ్డి, ధన్ సింగ్, సూర్యకాంత్, విజయేందర్ రెడ్డి, కె.మహేందర్, నారాయణఖేడ్ అర్బన్ అధ్యక్షులు భీంరావు, ప్రధాన కార్యదర్శి జగన్మోహన్, మనూర్ అధ్యక్షులు యస్. మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సర్దార్, నాగలిగిద్ద అధ్యక్షులు యస్.రమేశ్, ప్రధాన కార్యదర్శి నాగనాథ్, కల్హేర్ అధ్యక్షులు రాంమోహన్ రావు, ప్రధాన కార్యదర్శి వంశీకృష్ణ, సిర్గాపూర్ అధ్యక్షులు నర్సింగ్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, నిజాంపేట అధ్యక్షులు జి. ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్, ఉపాధ్యాయులు, బంధువులు, మిత్రులు తదితరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.