
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం,ఏప్రిల్19,(గరుడ న్యూస్ ప్రతినిధి):
యువత ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడి డబ్బులు పడగొట్టుకొని ప్రాణాలను మీదికి తెచ్చుకున్న సంఘటనలు ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాము.ఈ మధ్యకాలంలో హైదరాబాదులో ఒక విద్యార్థి ఐపీఎల్ బెట్టింగ్ లో లక్ష రూపాయలు పెట్టి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.దయచేసి యువత విద్యార్థుల తల్లిదండ్రులు క్రమశిక్షణతో పిల్లలను పెంచాలని వాళ్ల యొక్క ప్రవర్తనను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని బెట్టింగులకు గాని ఇతర చెడు వసనాలకు అలవాటు అయినట్లయితే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని పోలీసు వారు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి తెలిసేలా వారిలో మార్పు వచ్చేలా చేస్తామని ఎస్ఐ జగన్ తెలియజేశారు.

