రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం ఏప్రిల్19,(గరుడ న్యూస్ ప్రతినిధి):
బిఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బిఆర్‌ఎస్ పార్టీ యువజన విభాగం మండల ప్రధాన కార్యదర్శి గడ్డం నరేష్ పిలుపునిచ్చారు.ఈ నేపథ్యంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రజలకు వాగ్దానాలు చేసి నేడు వాటిని తీర్చలేక ప్రజలను మభ్య పెడుతున్నటువంటి విషయాన్ని బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తెలియజేశారు.ఈ సందర్భంగా ఈనెల 27వ తేదీన వరంగల్లో జరిగే భారీ బహిరంగ సభ కు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు,పెద్ద ఎత్తున సమావేశానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు,తదితరులు,పాల్గొన్నారు.



