గరుడ ప్రతినిధి పుంగనూరు
పుంగనూరు నియోజకవర్గంలో ని సదుం మండల తాసిల్దార్ కార్యాలయంలోశనివారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తుండగా కార్యాలయంలో గల అధికారులు వణికిపోయారు . ఓ రైతుకు సంబంధించిన భూ సమస్య పరిష్కారానికి పట్టాదారు పాస్ పుస్తకాలు చేయడానికి సదుం తాసిల్దార్, మరియు వీఆర్వో డబ్బులు అధిక మొత్తంలో డిమాండు. చేశారు దీనిని ఆసరాగా చేసుకున్న షఫీ ఉల్లా ఏసీబీ అధికారులను ఆశ్రయించారు వారి కనుసైగల్లో మరియు వారి పథకం ప్రకారం శనివారం మధ్యాహ్నం షఫీ ఉల్లా అనే రైతు దగ్గర నుంచి 1.75 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు గత మూడు నెలలుగా మంతనాలు జరిగాయి అంత మొత్తం ఇచ్చుకోలేనిని శనివారం నాడు 75000 రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ బాధికారులు మెరుపు దాడి చేశారు సదుంతహసిల్దార్ హుస్సేన్, మరియు అమ్మగారిపల్లి విఆర్వో మహబూబ్ బాషా లు లంచం తీసుకుంటుండగా ఏసీబీ. డి.ఎస్.పి విమల కుమారి తహసీల్దార్ హుస్సేన్ మరియు విఆర్ఓ మహబూబ్ బాషను డీఎస్పీ.విమల కుమారి విచారిస్తున్నారు




