
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,ఏప్రిల్20,(గరుడ న్యూస్ ప్రతినిధి):
హైదరాబాద్‌లోని జిల్లెలగూడలోని కిడ్స్ వరల్డ్ మాంటిస్సోరి పాఠశాలకు చెందిన వైష్ణవి ఆనందపు,వాగ్దేవి నృత్య అకాడమీకి చెందిన నాట్యగురువు ఎం కృష్ణ ప్రియ విద్యార్థిని భరత్ డ్యామీ ఆర్ట్‌సీసన్‌లో నిర్వహించిన కూచిపూడి కళావైభవం మహాబృంద నాట్యకళా కార్యక్రమంలో పాల్గొని గిన్నిస్ రికార్డు సాధించారు.డిసెంబర్ 24,2023న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో భారతదేశంలోని ఎనిమిది ప్రధాన శాస్త్రీయ నృత్య రూపాలలో కూచిపూడి నాల్గవదిగా గిన్నిస్ ప్రపంచ రికార్డులచే గుర్తించబడింది మరియు నమోదు చేయబడింది.ఆమెకు గిన్నిస్ వరల్డ్ మరియు కళాకారు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ రెండు ప్రధానం చేయబడ్డాయి.ఈ నేపథ్యంలో పాఠశాల యాజమాన్యం చాలా సంతోషం వ్యక్తం చేశారు.కిడ్స్ వరల్డ్ మౌంటస్సోరి కరస్పాండ్ శ్రీనివాస్ రావు,ప్రిన్సిపల్ కే సరిత వారి స్కూల్ యొక్క విద్యార్థి వైష్ణవి గిన్నిస్ వరల్డ్ ఇన్ కూచిపూడి డాన్స్ 2025 లో అభినందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు,తదితరులు,పాల్గొన్నారు.

