తిరుపతి జిల్లా, తిరుచానూరు గరుడ న్యూస్ (ప్రతినిధి): హరికృష్ణ; మాజీ ఉపరాష్ట్రపతి, స్వర్ణ భారత్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ముప్పవరపు వెంకయ్య నాయుడుని ఎడిఫై స్కూల్స్ డైరెక్టర్ ప్రణీత్ ఫౌండేషన్ ఫౌండర్ ప్రణీత్ పెనుమాడు మర్యాదపూర్వకంగా కలసి దుశ్శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నేపద్యంలో ఎడిఫై స్కూల్స్ కార్యకలాపాల గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ప్రణీత్ ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి అభినందించారు.అలాగే నిరు పేదలకు ఉచితంగా అందిస్తున్న మార్చురీ అంబులెన్స్ సేవలు ప్రశంసనీయమని అభివర్ణించారు. ప్రణీత్ ఫౌండేషన్ వారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ప్రోత్సహించారు.




