
గరుడా ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఎంఆర్పిఎస్ నాయకులు ఆదివారం మధ్యాహ్నం సంబరాలు చేసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ జీవో రావడంపై హర్షం వ్యక్తం చేశారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. మిఠాయిలు పంచారు అలాగే మందకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఎమ్మార్పీఎస్ నాయకుడు నరసింహులు మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ జాతి పోరాటంతో 30 సంవత్సరాలుగా ఆయన పోరాటం చేసిన తర్వాత. ఎస్సీ వర్గీకరణ జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వానికి ఎమ్మార్పీఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.