
సాలూరు,ఏప్రిల్ 20, గరుడ న్యూస్ ప్రతినిధి : నాగార్జున
సాలూరు శ్రీ సత్యసాయి డిగ్రీ కళాశాలలో ఈ నెల 23న ఉదయం 9.00గం.లకు జాబ్ మేళా జరగనుందని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. నిరుద్యోగ యువత జాబ్ మేళాలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి కల్పనలో భాగంగా 10వ తరగతి, ఇంటర్, ఐటిఐ, ఏదైనా డీగ్రీ చదువుకొని 18 నిండి 28 ఏళ్లు ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు జాబ్ మేళాకు అర్హులని తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 23వ తేదీ అనగా బుధవారము ఉదయం 9. 00 గం.ల నుంచి శ్రీ సత్యసాయి డిగ్రీ కళాశాల, సాలూరులో జరిగే జాబ్ మేళాకు హాజరుకావచ్చని చెప్పారు. ఈ జాబ్ మేళాలో 11 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై అర్హత కలిగిన అభ్యర్థులను వారి కంపెనీలోకి ఎంపిక చేసుకోవడం జరుగుతుందని వివరించారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీ యువకులకు తమ వివరాలను https://naipunyam. ap.gov.in వెబ్ సైట్ నందు తప్పనిసరిగా నమోదు చేసుకొని, రిఫరెన్స్ నెంబరుతో పాటు బయో డేటా, ఆదార్ కార్డు, విద్యార్హత సర్టిఫికేట్లు ఒరిజినల్ మరియు జెరాక్స్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో హాజరు కావాలని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు 94947 77553, 73825 59022 మొబైల్ నెంబర్లను సంప్రదించవచ్చని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.
