తిరుపతి జిల్లా, తిరుచానూరు గరుడ న్యూస్ (ప్రతినిధి): హరికృష్ణ: శ్రీ పద్మావతి అమ్మవారిని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద ఆలయ సూపరింటెండెంట్ రమేష్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయాధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.





