
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,ఏప్రిల్21,(గరుడ న్యూస్ ప్రతినిధి):
గత రెండు రెండు సంవత్సరాలుగా మల్కాపూర్ గ్రామ ప్రజలు వాహనాలు కొనుక్కొని ఐఎన్టియుసి అనుబంధ సంస్థ ద్వారా గ్రీన్ఇండస్ట్రియల్ పార్కులో యూనియన్ ఏర్పాటు చేసుకొని జెండా ఆవిష్కరణ చేసుకుని చిన్న గుడిసె ఏర్పాటు చేసుకుని వాహనాలు తోలుతున్నారు.ఏ కారణం లేకుండా టిఎస్ఐసి కమిషనర్ అంటూ వ్యక్తి వచ్చి అతనితో పాటు 30 మంది అనుచరులు జెసిబి తో ఐ ఎన్ టి యు సి ట్రేడ్ యూనియన్ జెండాను వారు ఏర్పాటు చేసుకున్న గుడిసెను తొలగించడం తొలగించారు.అందులో కంపెనీకి సంబంధించిన పేపర్లు మరియు గాంధీ మహాత్ముని చిత్రపటం,డాక్టర్ అంబేద్కర్ చిత్రపటం తీసుకునే టైం కూడా ఇవ్వకుండా కూల్చివేయడం జరిగింది.వారు ఏర్పాటు చేసుకున్న జెండా స్థలానికి టిఎస్ఐసీ వారికి ఎలాంటి సంబంధం లేదు ఇది విలేజ్ సంబంధించిన భూమి దీనిపైన ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుని న్యాయం జరిగేలా చూడాలని ఐ ఎన్ టి యూ సీ యూనియన్ చౌటుప్పల్ మండల అధ్యక్షులు చామట్ల శ్రీనివాస్,చౌటుప్పల్ మండల ప్రధాన కార్యదర్శి మహమ్మద్ చాంద్ పాషా డిమాండ్ చేశారు.

