గరుడ న్యూస్,సాలూరు
గెరాల్డ్ నెల్సన్ సాధించిన అత్యుత్తమ విజయం వరల్డ్ ఎర్త్ డే. ఏప్రిల్ 22 1970 లో పర్యావరణ పరిరక్షణ భూమి గాలి నీరు వంటి వాటి కాలుష్యాన్ని అరికట్టి మనిషి జీవించడానికి అనుకూలమైన భూగ్రహాన్ని కాపాడుకోవాలని ప్రతి సంవత్సరం అవగాహన కార్యక్రమాలు ప్రకృతి పరిరక్షణ వాతావరణ మార్పులు కాలుష్య నివారణ వంటి వాటిపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తారు. 2025 సంవత్సరం థీమ్ “మన శక్తి మన గ్రహం”.ప్రపంచ వ్యాప్తం గా 192 కి పైగా దేశాలలో ప్రపంచ ధరిత్రి దినోత్సవం జరుపుకుంటారు.సాలూరు టౌన్ లో గ్రీన్ వరల్డ్ సేవా సంస్థ వ్యవస్థాపకులు సంతోష్ కుమార్ శర్మ పాణిగ్రాహి ఆద్వర్యం లో సభ్యులు సిగడాపు బ్రదర్స్ సిగడాపు కుమార్ స్వామి, సిగడాపు మోహన్ కుమార్ సహకారం తో సాలూరు జైపూర్ రోడ్ లో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు.మజ్జిగ,పుచ్చకాయ ముక్కలు,మంచి నీరు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం లో గ్రీన్ వరల్డ్ సేవా సంస్థ సభ్యులు గోర్లె దేవేంద్ర నాయుడు, మద్ధుల భార్గవ్ మద్దుల సుధాకర్ దంపతులు,మీగడ నరేంద్ర,గణేష్ రెడ్డి శంకర రావు ఇంకా యువత అధిక సంఖ్య లో పాల్గొన్నారు.




