ప్రతిభ చాటిన Bమఠం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థులు
             

Sesha Ratnam
2 Min Read

కడప జిల్లా, మైదుకూరు మండలం బ్రహ్మంగారి మఠం గరుడ న్యూస్ (ప్రతినిధి):  A. ఓబుల్ రెడ్డి: ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 23వ తేదీన విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో శ్రీ గోవిందమాంబ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల  విద్యార్థులు సత్తా చాటారు. ప్రైవేటుకు దీటుగా ఉత్తమ ఫలితాలు సాధించి అందరి మన్ననలు పొందుతున్నారు. పాఠశాల విద్యార్థిని కటారి వెంకట నవ్య శ్రీ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 566 మండల టాపర్ 1 గా నిలిచారు . అలాగే557 మార్కులతో కే గురుపవిత్ర  మండల టాపర్ 2గా నిలిచారు.    533 మార్కులతో జోత్స్న పాఠశాలలో మూడవ స్థానంలో నిలిచింది  , పూజిత, 515,వైష్ణవి  515 మార్కులతో పాఠశాలలో నాలుగవ స్థానం  నిలిచారు.R నాగశ్రీ బ్రాహ్మణి 512 మార్కులతో 5వ స్థానంలో నిలిచింది. 6 మంది విద్యార్థులు పాఠశాలలో 500 పై మార్కులు   సాధించి పాఠశాలకు గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చారని, నిరుపేద విద్యార్థులైన కష్టపడి చదివి విద్య నేర్పిన గురువులకు తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చారని పాఠశాల లోని ఉపాధ్యాయులను  అందరూ ప్రశంసించారు.
  ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యున్నతకై కృషి చేసిన ఉపాధ్యాయులును పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి  నిర్మలా దేవి గారు  ప్రశంసించారు. అలాగే సీనియర్ ఉపాధ్యాయులు తెలుగు ఉపాధ్యాయులు L కొండారెడ్డి, శ్రీ కె ప్రభాకర్ రావు సారు గారు మాట్లాడుతూ విజ్ఞానానికి కటోర శ్రమ తోడైతే అనుకున్న ఫలితాలు సాధించవచ్చునని అందుకు ఈ ఫలితాలే నిదర్శనమని సైన్స్ అసిస్టెంట్ ఏ చంద్రమౌళి, మాథ్స్ అసిస్టెంట్ సుమతి, మ్యాథ్స్ అసిస్టెంట్ సుహాసిని,డి శివప్రసాద్ రెడ్డి, కే ఓబులేష్ సోషల్ అసిస్టెంట్ మరియు ఉపాధ్యాయులందరూ  తెలిపారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారులు శ్రీ పుల్లయ్య గారు, శ్రీ వెంకటేశ్వర్లు గారు విద్యార్థులను ఉపాధ్యాయులను ప్రశంసించారు.

పదవ తరగతి విద్యార్థులు మండల ఫస్ట్ సెకండ్ వచ్చిన విద్యార్థులకు స్వీట్లు తినిపిస్తున్న ప్రధానోపాధ్యారాలు నిర్మలాదేవి , తెలుగు ఉపాధ్యాయులు, లెక్కల కొండారెడ్డి.
TAGGED:
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *