గరుడ న్యూస్, పాచిపెంట
రైతులు పాచిపెంట మండలంలో ఖరీఫ్ లో కొంతవరకు రబీ సీజన్లో ఎక్కువగా మొక్కజొన్న విత్తనాలను విత్తన ఉత్పత్తి కోసం వేస్తున్నారని కంపెనీతో సరియైన ఒప్పందం చేసుకోకుండా వెయ్యడం వలన దిగుబడి తగ్గిన తర్వాత వ్యవసాయ శాఖ కు ఫిర్యాదు చేస్తున్నారని కాబట్టి రైతులందరూ తప్పనిసరిగా విత్తనోత్పత్తి కోసం విత్తనాలు వేసినప్పుడు ఒప్పంద పత్రాన్ని రాతపూర్వకంగా తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి కే.రాబర్ట్ పాల్ సూచించారు పాంచాలి గురువు నాయుడుపేట గ్రామాలలో వ్యవసాయ కార్యక్రమాలను పరిశీలించిన అనంతరం రైతులతో మాట్లాడుతూ మన్యం జిల్లా లో వినియోగించడం కొరకు జిల్లా వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు కంపెనీకి మధ్య ఒప్పంద పత్రంలో ఉండాల్సిన నియమ నిబంధనలు తెలుపుతూ తయారుచేసిన ఒప్పంద పత్రాన్ని రైతులకు అందజేశారు ఈ ఒప్పంద పత్రంలో కంపెనీ ఇచ్చిన మినిమం గ్యారంటీ దిగుబడి కంటే తక్కువ వచ్చిన రైతులకు ఇవ్వాల్సిన నష్ట పరిహారం గురించి నియమ నిబంధనలను పొందుపరిచారు. విత్తన ఉత్పత్తి కోసం ప్రైవేటు కంపెనీ విత్తనాలు వేసే రైతులందరూ తప్పనిసరిగా ఈ నమూనాలో అగ్రిమెంట్ తీసుకుని ఒక కాపీ కంపెనీకి ఇచ్చి ఒక కాపీ రైతు వద్ద ఉంచి మరొక కాపీని గ్రామ వ్యవసాయ సహాయకులకు సమర్పించాలని తెలిపారు ఈ ఒప్పంద పత్రంలో రైతు ఏ కంపెనీ విత్తనాన్ని ఏ రకాన్ని ఎంత విస్తీర్ణంలో ఏ సీజన్లో ఏ సర్వే నెంబర్లు వేశారో తెలుపుతూ కనీస గ్యారెంటీ దిగుబడి ఎంత వస్తుందో తెలుస్తుందని కంపెనీ ప్రతినిధులు, రైతులు ముగ్గురు సాక్షుల సంతకాలు కూడా ఒప్పంద పత్రంపై సేకరించాలని సూచించారు. పంటను నష్టపోయే పరిస్థితులలో ఈ ఒప్పంద పత్రం చాలా బాగుందని రైతులు తెలిపారు అనంతరం పాంచాలి గ్రామంలో వేసవిలో సాగు చేస్తున్న అపరాల క్షేత్రాలను పరిశీలించారు. చిరు సంచులలో ఉన్న విబిఎన్ 8 మినుము రకాన్ని గురువు నాయుడుపేట గ్రామంలో పరిశీలించారు ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో కలిసి నవధాన్యాలు 13 రకాల విత్తనాలను కలిపి కిట్లను తయారు చేసి రైతులకు అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాలూరు సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు మధుసూదన్ రావు వేసవి అపరాలు సాగులో తీసుకోవలసిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ధనుంజయ్ రావు వ్యవసాయ అధికారి కొల్లి తిరుపతిరావు, గ్రామ వ్యవసాయ సహాయకులు గణేష్, శ్రీను, ఎన్ ఎఫ్ ఎఫ్ శారద ఎంప్టీ యశోదమ్మ ఇతర ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.




