గరుడ న్యూస్,సాలూరు
592 మార్కులతో జిల్లా ఫస్ట్ సాధించిన సాలూరు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల కు చెందిన పెద్దపూడి తేజస్విని కి అభినందనలు తెలిపారు.సాలూరు గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థిని ఈ ఘనత సాధించి విజయకేతనం ఎగురవేసి స్కూల్ కీర్తి ప్రతిష్టలు నలుదిశలా చాటిన సందర్భంగా స్కూల్ ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయ సిబ్బంది ప్రశంసించారు.500 కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 19 మంది ఉండడం ఇక్కడ విశేషం.




