సోలం వారి కుంట లో మట్టి దొంగలు.
- మీడియా ముసుగులో మట్టి అక్రమ రవాణా.
- లక్షలు గడుస్తున్న వారి పై చర్యలు అధికారుల మౌన మేళ!!
- అక్రమ మట్టితోలకాలలో అధికారుల వాటా ఎంత…?
- అక్రమార్కులకు కొంత మంది అధికారుల అండదండలు
బయ్యారం,ఏప్రిల్ 24(గరుడ న్యూస్)
మండలంలో గత కొన్ని రోజులుగా మీడియా ముసుగు వేసుకొని జెసిబిల సహాయంతో సొంత ట్రాక్టర్లతో ఇదేచ్ఛగా మట్టి,ఇసుక దందా కొనసాగిస్తూన్నారు. అక్రమాలను బయటపెట్టి ప్రభుత్వ ఆదాయానికి సహకరించి ప్రజల అభివృద్ధికి పాటుపడాల్సిన విలేకరులు అక్రమ మట్టి తోవ్వకాల పై ప్రశ్నించే వారిపైనే దాడులకు ఉసిగొలుపుతూ గత కొన్ని రోజులుగా స్థానికులలో భయభ్రాంతులను సృష్టిస్తూ మాకు అడ్డు ఎవరూ లేరు. మమ్ములను ప్రశ్నించే వారు లేరు.అధికారుల అండదండలు మాకు పుష్కళంగా ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. అధికారుల అండతోనే ఈ తతంగం అంత జరుగుతుందా?? అని మండలంలోని ప్రజల లో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే మండలంలోని బయ్యారం రెవిన్యూ పరిధిలో సోలెం వారి కుంటలో గత కొన్ని రోజులుగా మట్టిని ట్రాక్టర్ల సహాయంతో తరలిస్తూ గృహం వినియోగదారులకు,రియల్ ఎస్టేట్ వ్యాపారుల స్థలాలకు అక్రమంగా మట్టి విక్రయాలను కొనసాగిస్తూ లక్షల గడుస్తున్నారు. ఇదంతా అధికారులకు తెలిసి జరుగుతున్న.. వారి మీద చర్యలు తీసుకుంటే మా మీదికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అని భయపడుతున్నారేమోనని ప్రజలు చేర్చించు కుంటున్నారు.కొంత మంది మీడియాను అడ్డుపెట్టుకొని మట్టినీ ఆక్రమంగా తరలిస్తున్న, కొంత మంది అధికారులు వీరికి అండగా ఉంటూ చీకటి ఒప్పందం చేసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని పలువురు పలు రకాలుగా చర్చిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మట్టి దొంగలను కట్టడి చేసిమట్టి తొలకాలకు ఉపయోగించిన వాహనాలను సీజ్ చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడాలని అధికారులను పలువురు స్థానికులు కోరుకుంటున్నారు.
దీనిపై మండల తహసీల్దార్ బి.విజయ ను వివరణ కోరగా మండలంలో ఎవరికీ ఎలాంటి మట్టి తొలకాలకు అనుమతులు ఇవ్వలేదని, ఎవరైనా అక్రమంగా మట్టి తరలిస్తున్నట్లు మీ దృష్టికి వస్తే మాకు తెలపాలని తెలిపారు. మట్టి అక్రమార్కులు ఎంతటివరైన మా దృష్టికి తెస్తే వారెవరైనా ఉపేక్షించేది లేదని వారిపై రెవెన్యూ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.



