

కులమతాలకు అతీతంగా ఉగ్రవాదంపై పోరాడాలి..
రేణిగుంట,పట్టణంలో జర్నలిస్టులు భారీ ర్యాలీ.
రేణిగుంట : జమ్ము కాశ్మీర్లోని పహల్గామ్‌లో అమాయక టూరిస్టులపై జరిగిన ఉగ్రవాదుల దాడుల నశించాలని దేశంలో తీవ్రవాదం లేకుండా చేయాలని సీనియర్ పాత్రికేయులు శివముర్తి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
బుధవారం పట్టణంలోని కస్తూరి గాంధీ విగ్రహం వద్ద,రేణిగుంట జర్నలిస్టులు కొవ్వొత్తులతో నిరసన, కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా జర్నలిస్ట్ లు,మాట్లాడుతూ ఉగ్రవాద దాడులు నశించాలని కోరారు.
పహల్గంలో అమాయకులైనా టూరిస్టులపై జరిగిన దాడిని ఖండించారు. ఉగ్రవాదులు దాడుల్లో పిరికిపంద చర్య అని మండి పడ్డారు. ఇది హేయమైన చర్యనీ తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. విహారయాత్రకు వచ్చిన వారిపై తుపాకులతో దాడి చేసి 27 మంది పర్యాటకులు మృతి చందారని అన్నారు. ఈ దాడి పట్ల తీవ్ర బాధను వ్యక్తం చేశారు. దాడిలో గాయపడినవారు త్వరగా, కోలుకోవాలని మృతి చెందిన వారికి,నివాళులు అర్పించారు. పహల్గామ్‌లో జరిగిన ఈ దాడి తీవ్రంగా కలిచి వేసిందన్నారు.
సైనిక దుస్తుల్లో వచ్చిన ఏడుగురు ఉగ్రవాదులు పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు, జరుపరారని ఈ చర్యను దుర్మార్గమైన ఘటనని అన్నారు.
ఆత్మీయులను కోల్పోయిన వారికి రేణిగుంట జర్నలిస్టుల తరఫున సానుభూతి తెలుపుతున్నామన్నారు. అనంతరం కస్తూరిబాయ్ గాంధీ విగ్రహం నుండి పటం లోని పురవీధుల గుండా జర్నలిస్టులో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. ఉగ్రవాదం నశించాలంటూ నినాదాలతో పట్టణంలో జర్నలిస్టుల హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల ఉమేష్, చిన్నారావు, మణి, భాగ్యరాజ్, మధు, కృష్ణమూర్తి, సత్య రాజ్, మురళి యాదవ్, శివ, జలీల్, కృష్ణంరాజు, రమేష్, రాజశేఖర్, మురళి, గణేష్, అప్సర్,నాగూర్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.



