గరుడ న్యూస్,సాలూరు
ఉన్నత విద్యకు ఉత్తమ క్రమశిక్షణకు, మార్కులైనా, ర్యాంకు లైనా,గ్రేడ్ లైనా దీప్తి స్కూల్ సంచలన ఫలితాలను అందిస్తూనే ఉంది. కార్పొరేట్ సంస్థలకు దీటుగా ఉత్తమ పలితాలు సాధిస్తూ ముందుకు సాగుతుంది.బి.రోషిణి ప్రియ 589 మార్కులు,టీ.సాహితీ 585 మార్కులు,ఎస్.శరణ్య రెడ్డి 582 మార్కులు, కె. రోషిణీ 582 మార్కులు,వై.లక్ష్మి వర ప్రసాద్ 580 మార్కులు సాధించారు.100 శాతం ఉత్తీర్ణత సాధించారు.5 గురు విద్యార్థులు 580 కి మించి మార్కులు సాధించారు.500 నుండి 549 మార్కులు సాధించిన విద్యార్థులు 14 మంది,500 మార్కులు కు పైబడి సాధించినవారు 35 మంది ఉన్నారు. మ్యాథ్స్ లో 100 కి 100 పది మంది సాధించారు.సోషల్ లో 100 కి 100 ముగ్గురు,తెలుగు లో ఒకరు 100 కి వంద సాధించారు.ఐఐటి/నీట్ ఫౌండేషన్ క్లాసులు అనుభవజ్ఞులైన అధ్యాపకులచే ప్రతిరోజూ పూర్తి స్థాయి విద్యాబోధన ప్రత్యేకత.పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,సిబ్బంది విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.




