

మన్యం, ఏప్రిల్ 24(గరుడ న్యూస్, పార్వతీపురం) : విజిలెన్స్ డిజి హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు శ్రీకాకుళం ప్రాంతీయ నిఘా మరియు అమలు విభాగం ఎస్పీ బర్ల ప్రసాదరావు పర్యవేక్షణలో అటవీ శాఖ చేపట్టిన వివిధ పనులను పరిశీలనలో భాగంగా గురువారం పాలకొండ రేంజ్, వీరఘట్టం సెక్షన్ కు సంబంధించి అటవీ శాఖ చేపట్టిన మొక్కల పెంపకం మరియు ట్రెంచ్ నిర్మాణ పనులు విజిలెన్స్ అధికారులు పరిశీలించడం జరిగింది. తనిఖీల్లో విజిలెన్స్ శాఖ డిఈ సత్యనారాయణ, అసిస్టెంట్ జియాలజిస్ట్ సురేష్ కుమార్, ఏఈ గణేష్ పాల్గొని రికార్డులలో పేర్కొన్న విధముగా పనులు జరిగినవా లేదా అను అంశాలను పరిశీలించారు. మరియు పూర్తి నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని పేర్కొన్నారు. తనిఖీల లో విజిలెన్స్ అధికారులతో పాటు పాలకొండ అటవీ రేంజ్ కు సంబందించి అటవీ అధికారులు పాల్గొన్నారు.



