

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల PRTU ప్రధాన కార్యదర్శి రాజు ఉపాధ్యాయులు ఒక సందర్భంలో మాట్లాడుతు ఈ వేసవి సెలవులను పిల్లలు ఏవిధంగా గడపాలి ఈ వేసవి సెలవులు, విజ్ఞానం, వినోదం, మేళవింపుతో కొత్తగా చిరకాలం గుర్తుండేలా! ఎలా? చేసేద్దాం అని చలోచించండి.ఇన్నాళ్లు పుస్తకాలు, పరీక్షలు అంటూ కుస్తీపడి అలిసిపోయారా? మరి సెలవులు వచ్చాయి. సరదాగా ఈ సమయంలో రోటీను గా సినిమాలు చూద్దామా? లేదా? సూర్య ప్రతాపంలో మాడిపోదామా ? సెల్ పోనుల మోజు లో పడి జీవితానికి చెదలు పట్టిద్దామా ఆలోచించండి . ఎందుకంటే నేటి పిల్లలు ఫోన్ల మోజు లో పడి అన్నింటికీ దూరంఅవుతున్నారు. ఆట లు లేవు, ఆనందాలు లేవు, వినోదాలు లేవు ,విజ్ఞానం అసలే లేదు, వినూత్న ఆలోచన, అంతరించిపోయింది. టి .వి,ఫోన్ల మోజులో పడి పిల్లలు బందిలై పోతున్నారు.బుర్రలు హీటెక్కి, చికాకు, కోపాలు ప్రదర్శిస్తూ , పేరెంట్స్ పై అరుస్తూ భయపెట్టేస్తున్నారు. నేర్చుకోవడం ఏమో కానీ నీతి, నిజాయితీ, నైతికత,సహా భావన, సోధరత, ఉదారత అణువంతైన లేదు. ఒంటరి తనం, సెల్ ఫోన్ల తో స్నేహం ,ఒక్కటే పిల్లలకు ఫ్యాషన్ గా మారింది.నేడు జరుగుతున్న కొన్ని సంఘటనలు. చూస్తుంటే దేశ భవిష్యత్తుపై భయం వేస్తుంది. చూచిరాత వద్దంటే టీచర్ పై కత్తులతో దాడి,ఆలస్యంగా వచ్చావని నిలదీస్తే యాసిడ్ దాడి,పోన్లో మాట్లాడవద్దు అంటే! చెప్పుతో కొట్టడం.ఇవి విద్యార్థుల మానసిక స్థితిని తెలియ చేస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు చూస్తే జాతి భవిష్యత్తు ఏమవుతుందో అని ఆందోళన కల్గించక మానదు. తల్లిదండ్రులు , లేదా టీచర్లు గట్టిగా బెదిరిస్తేనే ఆత్మ హత్యలు చేసుకుంటున్న పిల్లలను చూస్తే! ప్రతి పేరెంట్స్ లో ఆందోళన కనబడుతుంది.వీటికి తోడుగా, విచ్చల విడిగా, జరుగుతున్న డ్రగ్స్ సంఘటనలు, మత్తుపదార్థాల వాడకం, చెడు అలవాట్లు, జెల్సాలు, నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఇవన్నీ భవిష్యత్తు ను భయకంపితం చేసేవే. జైళ్ల లాంటి చదువులకు అలవాటు పడిన పిల్లలు తల్లి, తండ్రులంటే లెక్క చేయడం లేదు. పెద్దలను పట్టించుకోవడం లేదు.నీతి, నిజాయితీ కరువైంది. చట్టాల పై అవగాహన లేకుండా పోయింది. వీటికి అనేక కారణాలున్నాయి. కానీ చట్టాలు ధనికులకు,అధికారం ఉన్నవారికిచుట్టలుగా మారాయా? అని అనిపిస్తుంది.అందుకే నేమో ఈ విచ్చలవిడితనం. దయచేసి తమ పిల్లలు ఫోన్లో ఉన్నప్పుడు ఒకకంట కనిపెట్టుకోండి. తప్పుగా అనిపిస్తే వారిని బెదిరించండి . నోచ్చుకున్న పర్వాలేదు.మహనీయ అధికారులు ,మనమందరం కూడా చట్టాలు ఎవరి చుట్టం కావు అనే భావన కల్పించాలి.చాట్టలు అంటేనే భయం,భక్తి రెండు విద్యార్థి దశలోనే వాటిపై అవగాహన కల్పించాలి . చట్టాలు కఠినంగా అమలు చేయాలి. నీతి, నిజాయితి, నైతికత, దేశ భక్తి, సహాయ గుణాన్ని పిల్లల్లో నింపేవిధంగా ప్రయత్నించండి.ఇవి విద్యలో ఒక భాగంగా చేయాలి. ప్రతి పిల్లవాడికి విద్యలో భాగంగా 2 సం|| మిలిటరీ ట్రైనింగ్ మనదేశం లో విధిగా చేర్చాలి. అప్పుడు దృఢత్వం , దేశ భక్తి, నీతి నిజాయితీ, క్రమశిక్షణ అలవడుతుంది.”ఈ సమ్మర్ లో నైనా వినోదం, విజ్ఞానం మేళవించి కొత్తగా గుర్తుండేలా గడిపేద్దాం..రోజుకో పుస్తకం చదువుదాం! సెలవుల్లో కూడా పుస్తకాలే నా అని అనవచ్చు. కాని మనం ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవలసింది చాలా ఉంది.విజ్ఞానం రేకెత్తించే మంచి పుస్తకాలు చదవడం .నిర్మణాత్మక వ్యక్తిత్వ వికాసానికి తోడ్పాటు నిస్తాయి. కొత్తగా భాషను నేర్చుకోండి, సంగీతం, క్రాఫ్ట్, నేర్చుకోండి, వ్యాయమాలు చేయండి.ఇవి శరీరానికి సౌష్ఠవం చేస్తాయి, మానసికంగా దృఢంగా చేస్తాయి.సాహస యాత్రలకు వెళ్ళండి, వివిధ రకముల మనుషులను కలవండి. మీ శరీరాన్నికి, మానసిక వికాసానికి ,రిచార్జ్ చేసుకోండి. యోగా,స్విమ్మింగ్ లాంటివి అలవాటు చేసుకోండి ఆటలు ఆడండి. (ఎండలో కాదు.)నవ్వుతూ, నవ్విస్తూ ఆనందించండి. ఈ పోటీ ప్రపంచంలో ఎప్పుడూ పరుగెడుతునే ఉండాలి.ఉంటేనే మనకు, ఉపాధి అవకాశం లో మనకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఖాళీ సమయంలో సరదాగా కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి.ఇది విద్యార్థి దశకు ఎంతో ఉపయోగం. కమ్యునికేషన్ , మల్టీమీడియా ఏఐ,డిజిట్ మార్కెట్, సైబర్ సెక్యూరిటీ,, డాట సైన్స్, మెషిన్ లెర్నింగ్ లాంటి వాటి పై అవగాహన పొందండి.ఇవి మీకు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తాయి.వేడుకలలో పాల్గొనండి.అందరినీ ఆత్మీయంగా పలకరించండి. ఇది సామాజిక వికాసానికి ఎంతో ఉపకరిస్తుంది.వంట ప్రతిఒక్కరికీ అవసరమైన కనీస నైపుణ్యం.ఎప్పుడూ అమ్మేనా వంటచేసేది సరదాగా మీరు చేయండి.కలిసి భోజనం చేయండి.మీరే గరిటెతో వడ్డించండి.మీ అమ్మా,నాన్నలకు. ఇది మీ కుటుంబం సంతోషం లో విరబూసే ఆ ఆనందాలు, మహాదానంద కరంగా ఉంటుంది. పిల్లలూ మీరు ఈ సమ్మర్ లో సెలవులను వినోదాత్మక, విజ్ఞానాత్మక,వికాసాత్మకంగా గడుపాలని ఆశిస్తూ.. మీరు సూర్యప్రతాపానికి దూరంగా ఉండాలి అని,తరుచూ కబ్బరినీరు కానీ ,నిమ్మరసం కానీ ,చల్లాని కుల్లాయి నీరు కానీ త్రాగుతూ ,ఎండలో తిరుగకుండా?సమ్మర్ ను సంతోషంగా గడుపుతారని కోరుతూ..