భారత్ పై ఉగ్రదాడి తీవ్రంగా కలిచి వేసింది ముష్కర మూకలను ఏరి వేయాలి, కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గం నాయకులు కుక్కల నరసింహ్మ

Garuda Tv
1 Min Read

రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం,ఏప్రిల్25,(గరుడ న్యూస్ ప్రతినిధి):

జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గంలో మంగళవారం జరిగిన కాల్పులలో 26 మంది పర్యాటకులు అసువులు బాయటం తీవ్రంగా కలచివేసిందని  కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గం నాయకులు కుక్కల నరసింహ్మ అన్నారు.పాకిస్తాన్ ఉగ్రవాదులను కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ చీల్చి చెందాడాలని భారత్ పై కన్నెత్తకుండా ఉగ్రవాదులను ఏరివేయాలని కోరారు.ఉగ్రదాడిలో గాయపడిన,మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరణించిన భారత పౌరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నామన్నారు.జమ్ము కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి అమాయకులను బలి తీసుకోవడం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంగా భావిస్తున్నాం పాకిస్తాన్ ఉగ్రవాదులను తొక్కి అణచివేయాలని,కాశ్మీర్లో ఇప్పుడిప్పుడే పర్యాటక రంగం వృద్ధి చెంది అక్కడి సామాన్యులకు యువతకు ఉపాధి లభిస్తున్న తరుణంలో మంగళవారం రోజున  ఉద్దేశపూర్వకంగానే ఉగ్రవాదులు పర్యాటక రంగాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో దాడి చేశారని ఇలాంటి పిరికిపంద చర్యలకు భారతదేశం ఎప్పటికీ తలవంచదని దెబ్బకు దెబ్బ కచ్చితంగా తీస్తుందని తెలియజేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *