
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం, సర్వేల్,ఏప్రిల్25,(గరుడ న్యూస్ ప్రతినిధి):
సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని సర్విల్ గ్రామంలో జరిగిన నాభిశిల(బొడ్రాయి),తృతీయ వార్షికోత్సవం సందర్భంగా మునుగోడు నియోజకవర్గం శాసనసభ్యులు సర్వేల్ గ్రామానికి రావడం జరిగింది.ఈ నేపథ్యంలో సర్వే గౌడ సంఘం మాజీ అధ్యక్షులు శ్రీ కంఠ మహేశ్వర మాజీ చైర్మన్,కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరమల్ల వెంకటేష్ గౌడ్,సంస్థాన్ నారాయణపురం మండలం మాజీ జెడ్పిటిసి సభ్యురాలు వీరమల్ల భానుమతి వెంకటేష్ గౌడ్,ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి శాలువా కప్పి సత్కరించి బొడ్రాయి పండుగకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు,భక్తులు,తదితరులు,పాల్గొన్నారు.

