రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం, ఏప్రిల్25,(తెలంగాణ గళం):
తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్షగా నిలబడేది గులాబీ జెండా మాత్రమేనని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నీళ్ల లింగస్వామి గౌడ్ అన్నారు.తెలంగాణ బాగుండాలని బీఆర్‌ఎస్ నాయకులు కోరుకుంటా అన్నారు.వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు రాష్ట్ర నలుమూలల నుండి బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు అధిక సంఖ్యలో రావాలని పిలుపునిచ్చారు.దేశానికే సేవలు అందించడానికి టీఆర్‌ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందామని వివరించారు.పరిణితి చెందడం ప్రకృతి ధర్మమని అన్నారు.
టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిందంటే అది ప్రజలు కోరుకున్న రెవల్యూషన్ అని చెప్పారు.రజతోత్సవం ఎందుకు చేసుకుంటున్నారని కొంతమంది వెకిలి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.తెలంగాణ ప్రజల విజయాన్ని ప్రపంచానికి చాటడానికే బీఆర్ఎస్ రజతోత్సవ సభ అని నీళ్ల లింగస్వామి గౌడ్ చెప్పారు.తెలంగాణ అస్తిత్వం కోసం 2001లో కేసీఆర్ పడికిలి బిగించి ఉద్యమాన్ని మొదలు పెట్టారని గుర్తుచేశారు.ఉద్యమం మొదలుపెట్టి నప్పుడు ఉత్పన్నమైన అన్ని అనుమానాలను కేసీఆర్ పటాపంచలు చేశారన్నారు.ఒక రక్తం చుక్క కూడా చిందించ కుండా రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు కేసీఆర్ అని కొనియాడారు.




