రిపోర్టర్ సింగం కృష్ణ,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,కొత్తగూడెం,ఏప్రిల్26,(గరుడ న్యూస్):
బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్ లో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,ప్రజలు లక్షలాదిగా విచ్చేసి విజయవంతం చేయాలని బిఆర్ఎస్ పార్టీ నారాయణపురం మండల కొత్తగూడెం గ్రామం శాఖ అధ్యక్షులు చెరుకుపెల్లి బీరయ్య ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.బిఆర్ఎస్ పార్టీ ఏర్పడి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి వస్తున్న సందర్భంగా భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు,తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని.ఈ కార్యక్రమానికి మునుగోడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.






