రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు ప్రతినిధి,చౌటుప్పల్,ఏప్రిల్27,(గరుడ న్యూస్):
అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించి,తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.ధాన్యం కొనుగోళ్లు ఎలా జరుగుతున్నాయని ఎమ్మార్వో,మార్కెట్ అధికారులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే రాజగోపాల్.చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో ధాన్యం ఆరబోయడానికి సీసీ(కాంక్రీట్ పనులను)చేయిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య,వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనా రెడ్డి,డైరెక్టర్లు పబ్బు శ్రీకాంత్ గౌడ్,సప్పిడి సంజీవరెడ్డి,ఇతర సభ్యులు,రైతులు,తదితరులు,పాల్గొన్నారు.



