గరుడ న్యూస్,సాలూరు
జమ్మూ కాశ్మీర్ లో మినీ స్విట్జర్లాండ్ గా పేరు గాంచిన పహల్గాం లోని బైసారన్ ప్రాంతం లో ఏప్రిల్ 22 మంగళవారం మధ్యాహ్నం పర్యాటకులపై ఉగ్ర ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు.ఉన్మాదుల నరమేధంలో అధికారికంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు.హిందువుల పై జరిగిన ఉగ్రదాడి నేపథ్యం లో అన్ని రాష్ట్రాలలో భద్రతా ఏర్పాట్లు పటిష్ఠం చేశారు.బాంబ్ డిస్పోజల్స్ ఆద్వర్యం లో ఆర్టీసీ కాంప్లెక్స్,పలు ప్రభుత్వ కార్యాలయాలు, జాతీయ రహదారి మీదుగా ఇతర రాష్ట్రాల నుండి వచ్చే కార్లు,లారీలు,ఇతర వాహనాల తనిఖీలు చేపట్టారు.అనుమానాస్పద వ్యక్తులు,అపరిచితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా సాలూరు టౌన్ సీఐ బొమ్మిడి అప్పలనాయుడు తెలిపారు.టౌన్ ఏఎస్ఐ శ్రీనివాసరావు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




