
సాలూరు నియోజకవర్గం గరుడ న్యూస్ ప్రతినిధి: నాగార్జున
నిన్నటి దినము అనగా తేదీ 26 4 2025 పాచిపెంట పోలీస్ స్టేషన్ తంగలం పంచాయతీ, పూలగూడ గ్రామస్తులైన పోయి అప్పలమ్మ w/o లేటు అప్పలస్వామి ఇచ్చిన ఫిర్యాదు వివరాలు ఫిర్యాది యొక్క భర్త అప్పలస్వామి వయసు 55 సంవత్సరాలు వ్యవసాయం చేసుకొని జీవిస్తూ ఉంటాడు. అప్పలస్వామి తంగలం గ్రామంలో తేదీ 25.04.25 న ఒక పెళ్లికి హాజరైనట్టు ఆ పెళ్లిలో ఫిర్యాదు భర్తకు పక్క గ్రామమైన పనసలపాడు కు చెందిన పోయి రాజు అని వ్యక్తితో గొడవ జరిగినట్లు ఈ గొడవను గ్రామస్తులు విడిపించగా అక్కడి నుంచి ఫిర్యాదు భర్త తన గ్రామమైన పూల గూడా కు రాత్రి పెళ్లి నుండి వెళ్లిపోవుటకు బయలుదేరినట్లు ఇంటికి రాకపోవడంతో ఉదయాన్నే ఫిర్యాది తన భర్త కోసం తంగ్లం గ్రామానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఫిర్యాదు భర్త ముఖం మీద రక్త గాయాలతో చనిపోయి పక్కన పడి ఉండడం గమనించి ఈ విషయం తంగ్లం గ్రామస్తులకు పెద్దలకు తెలియజేసి పాచిపెంట పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాది తన భర్త మరణంపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదు చేసుకున్నారు. సదరు ఫిర్యాదు పై అనుమానాస్పద మృతిగా పాచిపెంట పోలీసులు కేసు నమోదు చేసి ఈ దినము అనగా తేదీ 27 4 2025న దర్యాప్తు చేసి మృతుని శవం పై శవ పరీక్ష నిర్వహించడం జరిగింది.
దర్యాప్తు మృతుడు మరణముపై అనుమానం ఉన్న కోణంలో జరుగుతుంది.
